సిల్వర్ స్క్రీన్ పై డిఫరెంట్ కాంబినేషన్

Monday,December 03,2018 - 11:57 by Z_CLU

ఒకరేమో నేచురల్ స్టార్, మరొకరు విలక్షణ దర్శకుడు. వాళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది. కచ్చితంగా సినిమా కొత్తగా ఉంటుంది. వాళ్లే నాని, విక్రమ్ కుమార్. దాదాపు ఏడాదిగా డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు ఫైనలైజ్ అయింది.

నాని తన 24వ సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. సెన్సిబుల్‌, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న విక్ర‌మ్ కుమార్, నాని కోసం అదిరిపోయే స్టోరీలైన్ రెడీ చేశాడట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై న‌వీన్, ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తారు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది.

ఈ మూవీకి సంబంధించి అప్పుడే 2 గాసిప్స్ రౌండ్స్ కొడుతున్నాయి. వీటిలో ఒకటి ఏంటంటే.. హీరో సిద్దార్థ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడట. ఇంక రెండోది ఏంటంటే.. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడట. త్వరలోనే ఈ రెండు రూమర్స్ పై క్లారిటీ రానుంది. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.