నాని MCA ట్రైలర్ రిలీజ్

Tuesday,December 12,2017 - 06:25 by Z_CLU

ఫ్యామిలీ ఇమోషన్స్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది నాని MCA ట్రైలర్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. రీసెంట్ గా రిలీజైన ఆడియోతో ఇప్పటికే ఇంప్రెస్ చేసిన MCA టీమ్, ఇప్పుడీ ట్రైలర్ తో నాని ఫ్యాన్స్ లో సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే రేంజ్ లో క్యూరాసిటీని జెనెరేట్ చేసింది.

నాని మార్క్ న్యాచురల్ కామెడీ తో బిగిన్ అయ్యే ట్రైలర్ వదినతో పాటు ఇష్టం లేకపోయినా వరంగల్ వెళ్ళే మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ లోకి అమ్మాయి రావడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే, ఆ తరవాత సినిమాలో హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్షన్ కాన్ ఫ్లిక్ట్…, ‘అర్థరూపాయి పెట్రోల్ ధర పెరుగుతుందని తెలిస్తే అర్థరాత్రి వరకు పెట్రోల్ బంకు బయట అరకిలోమీటరు క్యూలో నిలబడతాం… అలాంటిది మా ఫ్యామిలీ జోలికొస్తే..’ అంటూ నాని చెప్పే డైలాగ్ సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తుంది.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి పెర్ ఫెక్ట్ అనిపించుకుంది. కీ రోల్ ప్లే చేసిన భూమిక ట్రయిలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.