నాని MCA టీజర్ రిలీజయింది

Friday,November 10,2017 - 12:25 by Z_CLU

నాని MCA టీజర్ రిలీజయింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు. అయితే  రీసెంట్ గా  ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేసిన MCA టీమ్,  ఇప్పుడు ఇంట్రెస్టింగ్  టీజర్  తో  సినిమాపై  ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్  చేసింది.  అయితే మిడిల్ క్లాస్ అబ్బాయిల్లో ఉండే న్యాచురల్ లక్షణాలను హైలెట్ చేస్తూ ఉండే ఈ  49 సెకన్ల టీజర్ లో నాని, సాయి పల్లవి జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ లా కనిపిస్తుంది.

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ తో నాని మరో బ్లాక్ బస్టర్ ని బ్యాగ్ లో వేసుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 15 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.