నాని MCA టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Wednesday,November 08,2017 - 06:06 by Z_CLU

నాని MCA డిసెంబర్ 15 న రిలీజ్ కానుంది.  సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఎట్రాక్ట్ చేయనున్నాడు. అయితే ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ని నవంబర్ 10 న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

 

‘నిన్నుకోరి’ లాంటి డీసెంట్ హిట్ తరవాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ ఉన్నాయి. దానికి తోడు టీజర్ రిలీజ్ అనగానే సోషల్ మీడియాలో అప్పుడే వైబ్రేషన్స్ బిగిన్ అయిపోయాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యాజిక్ కంపోజర్. దిల్ రాజు ప్రొడ్యూసర్.