ఇంప్రెస్ చేస్తున్న నాని MCA సెకండ్ సింగిల్

Wednesday,November 29,2017 - 06:26 by Z_CLU

నాని MCA సెకండ్ సింగిల్ రిలీజయింది. కొత్తగా కొత్తగా అంటూ బిగిన్ అయ్యే ఈ మెలోడీ జస్ట్ DSP ఫ్యాన్స్ నే కాదు  నాని ఫ్యాన్స్ ని కూడా మెస్మరైజ్ చేస్తుంది. ‘నేను లోకల్’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వస్తున్న ఈ కాంబోపై న్యాచురల్ గానే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఫ్రెష్ ట్యూన్స్ తో ఫిదా చేస్తున్నాడు DSP.

రీసెంట్ గా రిలీజైన MCA టైటిల్ సాంగ్ తక్కిన సాంగ్స్ పై క్యూరాసిటీ రేజ్ చేస్తే ఈ రోజు రిలీజైన ‘కొత్తగా కొత్తగా..’ సాంగ్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. సాగర్, ప్రియ హిమేష్ కలిసి పాడిన ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ పాటకి శ్రీమణి లిరిక్స్ రాశాడు.

నాని సరసన సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ లో భూమిక స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.