నాని MCA రిలీజ్ డేట్ ..

Tuesday,July 18,2017 - 10:15 by Z_CLU

ప్రస్తుతం ‘నిన్ను కోరి’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నాని వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘MCA’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే క్యాప్షన్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం 40 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా భూమిక ఓ ఇంపార్టెంట్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. నాని 20 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.