నాని ‘MCA’ లాంచ్ డేట్

Thursday,May 04,2017 - 12:06 by Z_CLU

ప్రస్తుతం ‘నిన్నుకోరి’ సెట్స్ పై బిజీ బిజీగా ఉన్నాడు నాని. నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ న్యాచురల్ స్టార్ అప్పుడే తన నెక్స్ట్ సినిమాకి గ్రౌండ్ వర్క్ బిగిన్ చేసేశాడు.

‘నిన్ను కోరి’ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే దిల్ రాజు నిర్మించనున్న ‘MCA’ సెట్స్ పై ఉంటాడు నాని. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ కి ఇప్పటికే ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్ మే 6 న ఈ సినిమాని లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అప్పుడే డిస్కషన్స్ బిగిన్ అయిపోయాయి.