నాని MCA హీరోయిన్

Monday,February 27,2017 - 03:08 by Z_CLU

ప్రస్తుతం ‘నిన్ను కోరి’ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు నాని. ఓ వైపు సెట్స్ పై ఉంటూనే మరో వైపు ఓ కంట తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘MCA – Middle Class Abbayi’ పనులపై కాన్సంట్రేట్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. U.S లో నివేద థామస్ తో సెట్స్ పై ఉంటూనే, అప్పుడే నెక్స్ట్ సినిమా హీరోయిన్ వేటలో ఉన్నాడు నాని.

గతంలో ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాకి డైరెక్షన్ చేసిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు యమ స్పీడ్ గా జరుపుకుంటుంది. ఇకపోతే నాని హీరోయిన్ విషయంలో ‘సాయి పల్లవి’ ని కన్సిడర్ చేస్తుందట సినిమా యూనిట్. మరి సాయి పల్లవితో ఇంకా అఫీషియల్ గా డిస్కస్ చేశారా లేదా..? అవతల నుండి రియాక్షన్ ఏంటి..? లాంటి విషయాలైతే బయటికి రాలేదు కానీ… ఈ జోడి కానీ ఫిక్సయితే లుక్ ఫ్రెష్ గా ఉంటుంది అని ఫీల్ అవుతుంది MCA బ్యాచ్.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘నిన్ను కోరి’ సినిమాకి మే 9 కల్లా ప్యాకప్ చెప్పాల్సిందేనని డిజైన్ చేసి పెట్టుకుందట సినిమా యూనిట్. అదే గనక జరిగితే మే లో ఈ సినిమా రిలీజ్, ఇమ్మీడియట్ గా MCA షెడ్యూల్ కూడా బిగిన్ అయిపోయింది.