రేపటి నుండి నాని MCA హంగామా షురూ

Tuesday,October 17,2017 - 12:14 by Z_CLU

ఈ దీపావళికి నాని MCA మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. సినిమా సినిమాకి గ్యాప్ అంటే మీనింగ్ తెలియని నాని, తన లాస్ట్ మూవీ ఫీవర్ నుండి ఫ్యాన్స్ ఇలా బయటపడుతున్నారో లేదో, తన నెక్స్ట్ మూవీ అప్ డేట్స్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘నిన్నుకోరి’ మూవీ తరవాత ఇమ్మీడియట్ గా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న MCA సెట్స్ పైకి వచ్చిన నాని, ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేసి కన్ఫం చేశాడు.

న్యాచురల్ స్టార్ నాని సరసన హ్యాప్పెనింగ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాలో భూమిక కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాని డిసెంబర్ 21 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, పక్కా ప్లానింగ్ గా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ కి ప్యాకప్ చెప్తుంది. ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజర్, రాజు ప్రొడ్యూసర్.