సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న నాని MCA

Friday,December 15,2017 - 03:11 by Z_CLU

నాని MCA సెన్సార్ క్లియరయింది. ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా డిసెంబర్ 21 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వదిన, మరుదుల రిలేషన్ షిప్ హైలెట్ కానుంది. డిసెంబర్ 16 న హన్మకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలెబ్రేట్ చేసుకోనున్న MCA కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. భూమిక కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.