పిచ్చిగా నచ్చావ్ అంటున్న నాని

Saturday,August 20,2016 - 09:57 by Z_CLU

 
”ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీని వల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని అందంగా ఎలా మలుచుకున్నాడు అనే కథతో తెరకెక్కుతున్న సినిమా పిచ్చిగా నచ్చావ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో నాని ఆవిష్కరించారు. సంజయ్‌, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శశిభూషణ్‌ దర్శకత్వం వహిస్తుండగా….. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కేవలం 46 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఆడియోను విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదల తేదీని వచ్చేనెలలో ప్రకటిస్తారు.