నాని హీరోగా క్రిష్ సినిమా...?

Sunday,February 19,2017 - 02:03 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు క్రిష్. ఈ మూవీ తర్వాత క్రిష్ చేయబోయే సినిమాపై చాలా స్పెక్యులేషన్ నడిచింది. ఒకదశలో విక్టరీ వెంకటేష్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో సినిమా ఓకే అయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వెంకీ మాత్రం పూరీ జగన్నాధ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడట. ఇదిలా ఉండగా, క్రిష్ నెక్ట్స్ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం… గమ్యం సినిమా కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. ప్రస్తుతం ఈ సీక్వెల్ కు స్టోరీ రాసుకునే పనిలోనే బిజీగా ఉన్నాడట. మరీ ముఖ్యంగా ఈ సీక్వెల్ లో నానిని హీరోగా తీసుకోబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ గాసిప్ నిజం అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే, ఓ మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది గమ్యం. ఇలాంటి  సినిమాకు సీక్వెల్ రావడం, అందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తే అందరూ హ్యాపీ.