Hero Nani ప్రారంభమైన దసరా మూవీ

Wednesday,February 16,2022 - 05:29 by Z_CLU

Nani , Keerthy Suresh’s ‘Dasara’ movie launched

ఇటివలే ‘అంటే సుందరానికి’ సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసిన నేచురల్ స్టార్ నాని మరో సినిమాను లాంచ్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ‘దసరా’ అనే సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాను ఈరోజు లాంచనంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభ వేడుకలో దర్శకులు సుకుమార్ , కిషోర్ తిరుమల, వేణు ఉడుగుల , శరత్ మండవ పాల్గొని యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. గెటప్ మాత్రమే కాదు క్యారెక్టరైజేషణ్ కూడా ఇప్పటి వరకూ చూడని విధంగా ఉండనుందని యూనిట్ చెప్తోంది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘నేను లోకల్’ తర్వాత నాని-కీర్తి కాంబోలో వస్తున్న సినిమా ఇది. సముద్రఖని , సాయి కుమార్ , జరీన ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నాడు.

Also Read ఆ రీమేక్ చేయబోతున్న నాగ చైతన్య ?

ఇటివలే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బేనర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics