నాని ‘జెర్సీ’ అసలు కథ వేరు...

Wednesday,March 13,2019 - 10:03 by Z_CLU

నాని ‘జెర్సీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని ఈ సినిమా విషయంలో. చేసే ప్రతి సినిమాని సీరియస్ గానే తీసుకుంటాడు అందులో అనుమానం లేదు , కాకపోతే ‘జెర్సీ’ ని బిగినింగ్ నుండే మరింత స్పెషల్ గా ట్రీట్ చేశాడు. ట్రైనింగ్ తీసుకుని మరీ ప్రొఫెషనల్ క్రికెటర్ లా మారాడు. దానికోసం… ఏజ్డ్ అని చెప్పుకోవాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు… కట్ చేస్తే ఇది జస్ట్ స్పోర్ట్స్ ఎంటర్టైనరేనా..? అస్సలు కాదు…

ఆడియెన్స్ లో అంచనాలు ఉండటం వేరు… ఫిల్మ్ మేకర్స్ నుండి నాని లాంటి స్టార్ వరకు ఓ సినిమాతో ఏదో చెప్పే ప్రయత్నం చేయడం వేరు. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ నేదో స్క్రీన్ పై ఎలివేట్ చేయబోతున్నాడు నాని  ‘జెర్సీ’ సినిమాతో. అసలు ‘జెర్సీ’ సినిమా సెట్స్ పైకి రావడానికి… సక్సెస్ గ్యారంటీ అని ‘జెర్సీ’ టీమ్ లో ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ కి రీజన్ ఒకటే అదే ‘స్ట్రాంగ్ ఎమోషన్’…

కథ ’96 రంజీ స్పెషల్ ఎడిషన్’ చుట్టూ తిరిగేదే అయినా క్రికెటర్ గా నాని లైఫ్ కి, క్రికెట్ కి మధ్య రిలేషన్ షిప్ అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. అసలు యంగ్ ఏజ్ లో క్రికెటర్ గా వెనక బడటానికి, మళ్ళీ అదే బ్యాట్ పట్టి తనను నిరూపించుకునే ప్రాసెస్ లో నాని క్యారెక్టర్ చేసే జర్నీ, జస్ట్ అవుట్ స్టాండింగ్ అంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

క్రికెట్ యూనిఫామ్ లో ఉన్న నాని స్టిల్స్ ని తప్ప ఎక్కడా ఈ న్యాచురల్ స్టార్ క్యారెక్టర్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్,  సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. సినిమాలో క్రికెట్ ఉంటుంది. డెఫ్ఫినెట్ గా లవ్ స్టోరీ కూడా ఉండబోతుంది. వీటన్నింటికి మించి  మరో హార్ట్ టచింగ్ ఎమోషన్ ఉన్న సినిమా ‘జెర్సీ’. ఏప్రియల్ 19 న రిలీజవుతుంది.