'జెర్సీ' షూటింగ్ అప్ డేట్స్

Sunday,December 09,2018 - 12:05 by Z_CLU

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో స్పోర్ట్ బేస్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామానాయుడు లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నాని- శ్రద్దా శ్రీనాథ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఎల్.బి.స్టేడియంలో క్రికెట్ సన్నివేశాలను షూట్ చేయనుంది యూనిట్.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి వరకూ టోటల్ షూటింగ్ ఫినిష్ చేసుకోనున్న ఈ సినిమా ఏప్రిల్ 19 న థియేటర్స్ లోకి రానుంది.