నాని 'జెర్సీ' అప్డేట్స్

Friday,September 28,2018 - 11:02 by Z_CLU

ప్రెజెంట్ ‘దేవదాస్’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న నాని నెక్స్ట్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టేసాడు.. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో నాని నటించబోతున్న’ జెర్సీ’ సినిమా క్రికెట్ బేస్డ్ మూవీగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాలో క్రికెటర్ గా నటించబోతున్న నాని ప్రస్తుతం క్రికెట్ కి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

ఇటివలే చెన్నైలో ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ అయింది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సాంగ్స్ కంపోజ్ చేసే పనిలో బిజీ అయ్యాడు. ప్రస్తుతం దర్శకుడు గౌతం చెన్నైలో అనిరుద్ తో కలిసి సాంగ్స్ రికార్డింగ్ లో పాల్గొంటున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. విజయదశమి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.