జెర్సీ టీజర్ రివ్యూ

Saturday,January 12,2019 - 12:24 by Z_CLU

నాని అప్ కమింగ్ మూవీ జెర్సీ. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేశారు. 36 ఏళ్ల అర్జున్.. లేటు వయసులో ఎలా స్టార్ క్రికెటర్ అవుతాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అదే విషయాన్ని టీజర్ లో కూడా చెప్పారు.

ఈ సినిమాలో పూర్తిస్థాయి క్రికెటర్ గా కనిపించబోతున్నాడు నాని. దీనికోసం రోజుకు 4 గంటల పాటు నెల రోజులు క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సినిమా టీజర్ సింపుల్ అండ్ స్ట్రయిట్ గా ఉంది. అర్జున్ అనే క్యారెక్టర్ ఎలివేషన్, అతడి స్ట్రగుల్ ను ఎస్టాబ్లిష్ చేయడమే టార్గెట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు.

టీజర్ లో క్రికెటర్ గా నాని లుక్ పెర్ ఫెక్ట్ గా ఉంది. సన్నివేశాలకు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింక్ అయింది. జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ బాగుంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఇది సెకెండ్ మూవీ. అటు మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ కు కూడా తెలుగులో ఇది రెండో సినిమా. శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా పరిచయమౌతున్న జెర్సీ సినిమా ఏప్రిల్ లో థియేటర్లలోకి రానుంది.