నాని 'జెర్సీ' లాంచ్ డీటెయిల్స్

Sunday,September 16,2018 - 01:10 by Z_CLU

ప్రస్తుతం దేవదాస్ సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసిన నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ అయిపోయాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో క్రికెట్ బేస్డ్ మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాను అక్టోబర్ 18న విజయ దశమి సందర్భంగా లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది… అదే రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ఫినిష్ చేయనున్నారని సమాచారం.

ఈ సినిమా కోసం వీలు కుదిరినప్పుడల్లా క్రికెట్ బ్యాట్ పట్టుకొని ట్రైనింగ్ తీసుకుంటున్నాడట నాని.. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.