నాని 'జెర్సీ' ఎట్రాక్షన్స్

Thursday,April 18,2019 - 03:00 by Z_CLU

ఎక్కడ చూసినా ‘జెర్సీ’ ఫీవర్ కనిపిస్తుంది. జస్ట్ యూత్, ఫ్యామిలీ అని తేడా లేకుండా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ‘జెర్సీ’ ఇంతగా ఎట్రాక్ట్ చేస్తుందంటే దాని మెయిన్ ఎట్రాక్షన్ ఇవే.

 

స్టోరీలైన్ : ఈ రోజు ఫ్యాన్స్ లో సినిమాపై ఈ స్థాయిలో క్యూరియాసిటీ ఉన్నా, నాని దగ్గరి నుండి ప్రొడ్యూసర్స్ వరకు ఇది గర్వించే సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నా, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి  మెయిన్ రీజన్ స్టోరీలైన్. అదే ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ టీమ్ ని ఒక్కటి చేసింది. రేపు క్రియేట్ కానున్న సెన్సేషన్ కి కూడా ఫస్ట్ క్రెడిట్ దక్కేది కథకే. అయితే ఆ స్థాయి కథకి నాని తప్ప ఇంకెవరైనా న్యాయం చేయగలిగేవారా..? అంటే క్వశ్చన్ మార్కే.

నాని : యూత్ నుండి ఫ్యామిలీస్ వరకు థియేటర్స్ కి రప్పించగలిగే స్టాండర్డ్స్ ఉన్న స్టార్ నాని. మరో పక్క ఏ స్థాయి ఎమోషన్ కైనా ప్రాణం పోయగల పర్ఫామర్. ‘జెర్సీ’ కథ రాసుకున్నప్పుడు గౌతమ్ నానిని ఇమాజిన్ చేసుకున్నాడో లేదో తెలీదు కానీ, ఇవాళ్టి వరకు ఈ సినిమా నుండి రిలీజయిన ఏ విజువల్ ని గమనించినా, అర్జున్ గా నానిని తప్ప ఇంకొకరిని కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. అంత న్యాచురల్ గా పర్ఫామ్ చేశాడు. దానికి తోడు శ్రద్ధా శ్రీనాథ్ నానికి జతవ్వడం మరింత గ్రేస్ ని జత చేసినట్టయింది.

శ్రద్ధా శ్రీనాథ్ : న్యాచురల్ స్టార్ కి సరైన జోడీ. ఇప్పటి దాకా శ్రద్ధా కనిపించిన విజువల్స్ లిమిటెడే అయినా, ప్రమోషన్స్ లో శ్రద్ధాకి ఈ సినిమా పట్ల, మరీ పర్టికులర్ గా తను ప్లే చేసిన క్యారెక్టర్ పట్ల ఉన్న క్లారిటీ చూస్తుంటే, ‘జెర్సీ’ లో  డెఫ్ఫినెట్ గా తన పర్ఫామెన్స్ కూడా అంతే హైలెట్ కానుందని తెలుస్తుంది. గర్ల్ ఫ్రెండ్ లా, ఏ జాబ్ చేయని హజ్బెండ్ పై కోపంగా ఉండే భార్యలా, తల్లిలా.. శ్రద్ధా పర్ఫామెన్స్ ‘జెర్సీ’ లో కీ ఎలిమెంట్ కానుందని తెలుస్తుంది. నిజానికి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకోని నాని, శ్రద్ధా లను జోడీగా ఇమాజిన్ చేసుకున్న గౌతమ్ ని ఓ సారి అభినందించాల్సిందే.

 

గౌతమ్ తిన్ననూరి : సైలెంట్ గా ఉంటూనే సినిమా చేసేశాడు. అటు ఫ్యాన్స్ లో సినిమా ఎప్పుడు హడావిడి కనిపిస్తుంది. ఇటు స్టార్స్ లోను ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఆడియెన్స్ ని రీచ్ అవుతుందా అనే ఆరాటం కనిపిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం అంతే కూల్ గా, సినిమా చేసేశాను.. అదే బ్లాక్ బస్టర్ అయిపోతుందిలే.. అన్నంత ధీమాగా ఉన్నాడు… కథ తీసుకుని నాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంతే ధీమాగా ఉన్నాడీ ఫిల్మ్ మేకర్. ఎలాగూ ఓకె అంటాడన్న నమ్మకం మరీ.. నాని కూడా అంతేగా.. జస్ట్ ఒక్క సినిమా చేసిన దర్శకుడే.. కానీ కథ రాసుకున్న విధానం.. నో అనకుండా చేసింది… ఇంతేనా వీటికి తోడు అనిరుద్ జతవ్వడం సినిమాకి మరింత ఫ్రెష్ నెస్ తెచ్చిపెట్టింది.

 

అనిరుద్ : ఈ సినిమా పాటలు వింటూంటే అనిరుద్ మామూలుగానే ఇన్స్ ట్రు మెంట్స్ వాడాడా..? లేకపోతే ఓ వైపు  కథని, మరోవైపు నాని బాడీ లాంగ్వేజ్ విజువల్స్ ని చూస్తూ సాంగ్స్ కంపోజ్ చేశాడా అనిపిస్తుంది. అంతగా సినిమాలో సింక్ అయ్యాడు అనిరుద్. అటు గౌతమ్, ఇటు నాని… సినిమా విషయంలో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే BGM కూడా అదరగొట్టేసే ఉంటాడు. ఇవన్నీ కాదు ‘జెర్సీ’ ని ఈ స్థాయిలో నిలబెట్టిన ఈ ట్యాలెంట్ బ్యాంక్ ఒక్క  చోటికి  చేరిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ నిర్మాత నాగవంశీ.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ : ఇలాంటి డిఫెరెంట్ కథను నమ్మి డబ్బులు పెట్టి ముందుకు రావడానికి చాలా ధైర్యం కావాలి. సితార నిర్మాతలు ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంటారు. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంటే ఇక్కడ జస్ట్ బడ్జెట్ కాదు. రియల్ టైమ్ అనుభవాల్ని వాడటం. ఈ సినిమాకి జస్ట్ పైసలు పెట్టలేదు నిర్మాతలు. ప్యాషన్ తో సినిమాని నిర్మించారు.

క్రికెట్ ఎలిమెంట్స్ : సినిమాలో వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్. సినిమాలోని కొన్ని సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని నాని స్వయంగా చెప్పుకున్నాడు. పర్టికులర్ గా  ఈ  ఎపిసోడ్స్ క్రికెట్ ఎక్స్ పర్ట్స్ పర్యవేక్షణలో తెరకెక్కించారు మేకర్స్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సందర్భంలో ఉండబోయే క్రికెట్ మ్యాచ్ రేపటి నుండి థియేటర్స్ లో రియల్ టైమ్ అనుభవాన్ని ఇవ్వబోతుంది.