ఆ ఛాన్స్ నాని కే దక్కింది

Thursday,October 05,2017 - 05:50 by Z_CLU

మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ముద్దుగుమ్మలు సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ గా మారిన సంగతి తెలిసిందే.. ఇప్పటి వరకూ  తెలుగులో ఈ భామలు  నటించిన సినిమాలు  సూపర్ హిట్ అవ్వడంతో ప్రెజెంట్ వీరిద్దరికీ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఇద్దరిలో ఒకరితోనైనా సినిమా చేయాలని భావిస్తున్నారు యంగ్ హీరోలు. అయితే ప్రేమమ్ బ్యూటీస్ లో ఒక్కరితోనైనా సినిమా చేయాలనుకుంటున్న యంగ్ హీరోలను కుళ్ళుకునేలా చేస్తున్నాడు నాని.

ఇటీవలే ‘నిన్ను కోరి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం ‘MCA’ సినిమాతో పాటు ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమాను కూడా సెట్స్ పై పెట్టిన విషయం తెలిసిందే.. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్స్ గా ప్రేమమ్ బ్యూటీ స్ ను సెలెక్ట్ చేసుకొని ఇద్దరితో చెరో  సినిమా చేస్తూ రెండు సినిమాల పై పాజిటీవ్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు నేచురల్ స్టార్. MCA సినిమాలో సాయి పల్లవితో జత కట్టిన నాని కృష్ణార్జున యుద్ధం లో అనుపమ తో జత కడుతున్నాడు. ఏదేమైనా ఈ ఇద్దరు  మల్లు బ్యూటీస్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ నానికే దక్కింది. మరి ఈ లక్కీ బ్యూటీస్ తో కలిసి నాని ఎలాంటి హిట్స్ అందుకుంటాడో..చూడాలి.