Nani DASARA - నేచురల్ స్టార్ మరో ప్రయోగం?

Wednesday,January 26,2022 - 04:04 by Z_CLU

Nani is doing an experiment with DASARA Movie

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ అనే డిఫరెంట్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటివలే ‘అంటే సుందరానికి’ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తిచేసిన నాని త్వరలోనే దసరా షూట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాని లుక్ లాక్ అయింది. ఇప్పటి వరకు చూడని కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు నాని. ప్రీ లుక్ పోస్టర్ తోనే లుక్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తెలంగాణా నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నాడని సమాచారం.

గతంలో నాని ‘జెండాపై కపిరాజు’ అనే సినిమాతో పాటు తాజాగా ‘V’ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించాడు. ఆ రెండు సినిమాలు నానికి ఆశించిన ఫలితం అందివ్వలేకపోయాయి. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేసి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో పూర్తి స్థాయి తెలంగాణా భాషలో మాట్లాడనున్నాడు నేచురల్ స్టార్. ఇందుకోసం హోం వర్క్ చేస్తున్నాడు.

శ్రీకాంత్ ఒదెల దర్శకుడిగా పరిచయం అవ్వనున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నాడు. మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా కోసం కొత్తగా ట్రై చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఆ సినిమా వచ్చిన కొన్ని నెలలకే ఈ సినిమాతో మళ్ళీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.