దర్శకుల నటుడు - నాని

Tuesday,April 09,2019 - 10:02 by Z_CLU

క్యారెక్టర్ కి తగ్గట్టు మారిపోతాడు. అవసరమైతే ట్రైనింగ్ తీసుకుని మరీ సినిమా కోసం ప్రిపేర్ అవుతాడు. ప్రతీది మ్యాచ్ అవ్వాలనుకుంటాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. అల్టిమేట్ గా దర్శకుడు ఎలా కావాలనుకుంటాడో, అలా తనకు తానుగా న్యాచురల్ గా సింక్ అవుతాడు. ఈ విషయం ఫిల్మ్ మేకర్స్ కి క్లారిటీ ఉంది కాబట్టే నాని దర్శకులు కొత్త కథలు రాసుకుంటున్నారు. అలా తెరకెక్కుతున్నదే జెర్సీ.

జెర్సీ : జస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ కాదు. లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఓ వైపు యంగ్ క్రికెటర్ లా, అదే కాన్వాస్ పై మళ్ళీ సిచ్యువేషన్ కి తగ్గట్టు 36 ఏళ్ల ఏజ్డ్ క్రికెటర్ లా, ఫెయిల్యూర్ లా, సక్సస్ కోసం తపించే వాడిలా… ఓ రకంగా చెప్పాలంటే కంప్లీట్ జీవితంలోని డిఫెరెంట్ షేడ్స్ ని జెర్సీ లో డెలివర్ చేశాడు నాని. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రిలీజైన విజువల్స్ చూస్తే, సినిమాలో నాని ఎక్కడా లేడనిపిస్తుంది దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసుకున్న అర్జున్ ఒక్కడే కనిపిస్తున్నాడు.

దేవదాస్ : అసలు హీరోయిజమే లేని క్యారెక్టర్. అమాయకంగా.. సాఫ్ట్ గా కనిపించే క్యారెక్టర్. నాగార్జున లాంటి స్టార్ హీరోకి ఆన్ స్క్రీన్ బెస్ట్ ఎవర్ బడ్డీ. ఈ సినిమా రిలీజ్ తరవాత నాగ్, నానిల కెమిస్ట్రీ గురించి మాట్లాడని కార్నర్ లేదు. అంతగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి నటించాడు.

కృష్ణార్జున యుద్ధం : సినిమా అసంతృప్తి పరిచినా కృష్ణ క్యారెక్టర్ లో చేసిన నాని పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. డ్యూయల్ రోల్ లో నాని చూపించిన వేరియేషన్స్ ని ఓసారి గమనిస్తే, ఇంత హోమ్ వర్క్ ఎప్పుడు చేసి ఉంటాడు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ విజన్ ని అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టే, ఆ స్థాయి పర్ఫామెన్స్ స్క్రీన్ పై జెనెరేట్ అయింది.

MCA : ఈ సినిమాలో నానికి కనెక్ట్ అవ్వని మిడిల్ క్లాస్ అబ్బాయి ఉండడు. బిగినింగ్ అన్నంటే ఇష్టపడే తమ్ముడిలా, అంతలోనే వదినంటే పడని మరిదిలా… వీటి మధ్య ఇంట్రెస్టింగ్ లవర్ బాయ్ షేడ్స్ లో…. అంతలోనే క్యారెక్టర్ స్థాయి యాక్షన్ ఎమోషన్స్ లో కనిపించి, ఇలాంటి సినిమాలకు నాని అయితేనే కరెక్ట్ అనిపించుకున్నాడు.

నిన్నుకోరి : కొంచెం రిస్కీ సబ్జెక్టే. అల్టిమేట్ గా హీరో, హీరోయిన్స్ కలుసుకోరు మరీ… ఇలాంటి కథలు కనెక్ట్ అయితే క్లాసిక్ గా మిగిలిపోతాయి. చిన్న తేడా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర 2 రోజులకు మించి గట్టిగా నిలబడే స్థాయిలో ఉండవు. కానీ నాని ఆ ట్రెడిషన్ కి చెక్ పెట్టాడు. మూస పద్ధతిలో ఒకే రకం లవ్ స్టోరీస్ వస్తున్న సీజన్ లో కూడా డిఫెరెంట్ యాంగిల్ లో హిట్ కొట్టాడు.

నేను లోకల్ : ఫ్యామిలీ మొత్తం ఒక చోట కూర్చుని చూసే సినిమా. ఇంజినీరింగ్ పాసవ్వడానికి కష్టపడే ప్రతి కుర్రాడు ఈ సినిమాలో హీరోనే. హీరోయిన్ ఫాదర్ కి, హీరో కి మధ్య హిలేరియస్ సీక్వెన్సెస్ దగ్గరి నుండి హీరో పేరెంట్స్ వరకు ప్రతి క్యారెక్టర్ లో కనెక్టివిటీ ఉంటుంది. మధ్యతరగతి కుర్రాడిలా నాని పర్ఫామెన్స్ జస్ట్ అవుట్ స్టాండింగ్.

మజ్ను : లవర్ బాయ్ లా నటించాడు ఈ సినిమాలో. గతంలో ప్రేమించిన అమ్మాయి ఎదురుగా, ఇకో అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉండే సందర్భాల్లో నాని కామెడీ టైమింగ్ మరింతగా ఎలివేట్ అయిందీ సినిమాలో. ఆదిత్య గా యూత్ కి మరింతగా దగ్గరయ్యాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే నాని ప్రతి సినిమాలో ఒక్కో డిఫెరెంట్ షేడ్ కనిపిస్తుంది. అది ఎలాంటిదైనా నాని చేసేది ఒక్కటే న్యాచురల్ అనిపించేంతగా ఇన్వాల్వ్ అవ్వడం… అందుకే ‘నాని’ని దర్శకుల హీరో అంటుంటారు…