నాని ఇంటర్వ్యూ

Wednesday,April 17,2019 - 02:34 by Z_CLU

తన కరియర్ లోనే స్పెషల్ మూవీ ‘జెర్సీ’ అని చెప్పుకున్నాడు నాని. సినిమా ట్రైలర్ చూశాక ఆడియెన్స్ లో కూడా ఆ స్టేట్ మెంట్ వాస్తవమేనన్న బజ్ క్రియేట్ అయింది. ‘జెర్సీ’ కథే అద్భుతమంటున్నారు ఫిల్మ్ మేకర్స్. అలాంటి అద్భుతానికి నాని లాంటి న్యాచురల్ స్టార్ జత కలిస్తే బ్లాక్ బస్టరే అనుమానం లేదంటున్నారు ఫ్యాన్స్. ఓ వైపు సినిమాపై కావాల్సినంత పాజిటివిటీ…మరోవైపు ఫ్యాన్స్ లో సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని క్యూరియాసిటీ… వీటి మధ్య నాని స్పెషల్ గా ఈ సినిమా గురించి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు… సినిమాకి సంబంధించి మరెన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు… అవి మీకోసం…

టైటిల్ కి ఓ రీజన్…

జెర్సీ అంటే, స్పోర్ట్స్ మ్యాన్ వేసుకునే షర్ట్. అయితే ఆ ఒక్క రీజన్ తోనే సినిమాకి ‘జెర్సీ’ అని పేరు పెట్టుకోలేదు. సినిమాలో ఈ టైటిల్ వెనక ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది.

అదే సినిమా…

ట్రైలర్ లోనే ఎగ్జాక్ట్ సినిమా ఏంటనేది చెప్పేశాం. అందరూ లూజర్ అంటూండటం వల్ల న్యాచురల్ గానే ఓ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అయితే రోజు రోజుకి పెరిగిపోయే ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి దారి తీస్తుందనేదే అసలు కథ.

క్రికెట్ అంటే ఏంటో తెలిసింది…

నిజానికి ఈ సినిమా కన్నా ముందు క్రికెట్ అంటే మనకంతా తెలుసు అనుకునే వాణ్ణి. కానీ ఈ సినిమా కోసం తీసుకున్న ట్రైనింగ్ వల్ల ఎగ్జాక్ట్ క్రికెట్ అంటే ఏంటో తెలిసింది. క్రికెట్ అంటే జస్ట్ బ్యాట్ తో బాల్ ని కొట్టడం కాదు… చాలా ఉంది.

ఎమోషనల్ రీజన్ అదే…

ట్రైలర్ లో చూపించినట్టు ఫాదర్ కి కొడుకు మధ్య ఉండే బాండింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఆ స్థాయిలో ఎమోషనల్ గా కనెక్టవ్వడానికి రీజన్ అదే.

గొప్ప పని చేసిన ఫీలింగ్…

మా టీమ్ అందరికీ ఏదో రెగ్యులర్ సినిమా చేసేశాం అనే ఫీలింగ్ కన్నా, ఏదో గొప్ప పని చేసేశాం అని ఫీలింగ్ ఉంది. సినిమా హిట్టా.. సక్సెసా… కాదా… అనే ఆలోచనే లేదు. కాన్ఫిడెంట్ గా ఉన్నాం అనే దానికన్నా ఏదైనా గొప్ప పదం దొరికితే బావుండు… అలాంటి ఫీలింగ్ ఉంది…

అద్భుతమైన ఫీలింగ్…

సినిమా అయిపోయిన తరవాత ప్రతి ఒక్కరూ చాలా హ్యాప్పీగా బయటికి వస్తారు. ఒక ఎగ్జైట్ మెంట్ తో, అద్భుతమైన ఫీలింగ్ మిగిలిపోతుంది.

నటుడిగా నా ఆలోచన అదే…

నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలనేదే నా ఆలోచన. ఎమోషనల్, యాక్షన్ తో పాటు అన్ని జోనర్స్ లో నిరూపించుకోవాలనేదే నా తపన. అలాగని డిఫెరెంట్ జోనర్ అనిపించగానే చేసేయను. ఆ జోనర్ ని ఎంతందంగా ట్రీట్ చేస్తున్నామన్నది కంపల్సరీగా చూసుకుంటా…

 

ఎవరైనా అంతే…  

ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా… ఎవ్వరేమనుకున్నా తన పిల్లల దృష్టిలో మాత్రం హీరో అవ్వాలనే అనుకుంటాడు. ఆ విషయాన్నీ ట్రైలర్ లో మెన్షన్ చేశాం కాబట్టే అది ఆ స్థాయిలో రీచ్ అయింది.

కట్టప్ప కన్నా గొప్పవాడు…

బాహుబలి లో లాయల్టీ అంటే కట్టప్పనే. కానీ కట్టప్ప కన్నా గొప్పవారు సత్యరాజ్ గారు. ఆయన సినిమాకి లాయల్ గా ఉంటారు. ఆయన దృష్టిలో సినిమా కన్నా గొప్పదేదీ లేదు..

స్టార్ డమ్ ని నమ్ముతా…

నేను స్టార్ డమ్ ని నమ్ముతా. ఆ స్టార్ డమ్ అనేది ఊరికే రాదు. కంటెంట్ వల్లే వస్తుందని కూడా నమ్ముతా.

నేనెప్పుడూ అలా అనుకోను…

ప్రతి సినిమాకి నేను ఎదుగుతున్న మాట వాస్తవమే కానీ నా ఎదుగుదలను దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేయడం లేదు. నాకు వచ్చిన పని ఇది. చేసేది 100% పెట్టి చేయాలని చేస్తున్నా.. అదే నన్ను ముందుకు తీసుకువెళ్తుంది.

అదొకటే ఆలోచిస్తా…

కథ కనెక్టయిందా చేసేస్తా… అంతేకానీ ఈ సినిమా ఆడుతుందా..? లేదా..? అని అస్సలు ఆలోచించను. నేను కనెక్టయితే చాలు.. ఆ రీజన్ సినిమా చూసిన వాళ్ళెవరికైనా కనెక్టవుతుందని నమ్మకం.. అంతే.

జెర్సీ’ చైనా రిలీజ్…

‘జెర్సీ’ చైనా రిలీజ్ కి కూడా  ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. చైనాలో స్పోర్ట్స్ రిలేటెడ్, ఎమోషనల్ సినిమాలు సక్సెస్ ఫుల్ గా ఆడతాయి. దానికి తోడు ‘జెర్సీ’ లో ఎక్కడా ఒక్క సీన్ కూడా క్రియేట్ చేసినట్టు ఉండదు. ప్రతీది రియల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి చైనాలో కూడా సినిమా డెఫ్ఫినెట్ గా ఆడుతుంది.

న్యాచురల్ స్టార్’ ట్యాగ్ కూడా అలాంటిదే…

మా అమ్మా, నాన్న నాకు నవీన్ అని పేరు పెట్టారు. అమ్మ నన్ను ముద్దుగా ‘నాని’ అని ముద్దుగా పిలుచుకుంది. ఎప్పుడూ ఫిట్ అవుతుందా లేదా అని ఆలోచించలేదు. ఇప్పుడు న్యాచురల్ స్టార్ కూడా అంతే. ప్రేమగా పెట్టేశారు. అది నాకు ఫిట్టవుతుందా లేదా అనేది అనవసరం…