నాని ఇంటర్వ్యూ

Tuesday,July 04,2017 - 08:41 by Z_CLU

టాలీవుడ్ లో వరుస సినిమాలతో సూపర్ హిట్స్ సాధిస్తూ నెలల గాప్ లోనే థియేటర్స్ లో సందడి చేస్తున్న నేచురల్ స్టార్ ఈవారం ‘నిన్ను కోరి’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ కానున్న సందర్భంగా నాని మీడియాతో ముచ్చటించాడు.. ఆ విశేషాలు నాని మాటల్లోనే…

ఆ టైంలో ఈ కథ విన్నా

ఈ మధ్య ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాం. కంప్లీట్ గా మనల్ని కథతో కనెక్ట్ చేసి ఎమోషనల్ గా ఎంటర్టైన్ చేసే సినిమాలు తక్కువయ్యాయి. సో కేవలం కథ తో ఎమోషన్ తో అరెస్ట్ చేసే సినిమా  ఇప్పుడు చేస్తే బాగుంటుందని ఫీలవుతున్న టైం లో వచ్చిన కథే ‘నిన్ను కోరి’. కథ వింటున్నప్పుడు కొంచెం బోర్ గా ఫీలవుతాం. కానీ ఈ స్క్రిప్ట్ బాగా ఓన్ చేసుకుంటూ కథ మీదే ఫోకస్ పెడుతూ విన్నాను. ఫైనల్ గా నిన్న సినిమా చూడగానే ఊహించినట్లే వచ్చింది అనిపించి హ్యాపీ గా ఫీలయ్యాను.

కైమాక్స్ వినకుండానే ఓకే చేశా  

శివ ఈ కథ చెప్పడానికి  ముందు.. ఇప్పుడున్న కమిట్మెంట్స్ తో ఈ సినిమా చేయగలనా.. అనుకున్నాను  కథ చెప్పడం స్టార్ట్ చేసాక వింటూ ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయా. శివ సరిగ్గా ప్రీ క్లైమాక్స్ చెప్తుండగా ఒక్క నిమిషం ఆగు నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు కంటిన్యూ చేయి అని ఆ తర్వాత క్లైమాక్స్ విన్నాను. నిజానికి అంతగా ఈ స్క్రిప్ట్ కి కనెక్ట్ అయిపోయా.

 

హెల్ప్ లేకుండానే

బేసిగా శివ ఈ సినిమా స్టార్ చేసే టప్పుడు  ఫస్ట్ టైం కదా సపోర్ట్ ఇవ్వాలని అనుకున్నాం. కానీ మా సపోర్ట్, హెల్ప్ లేకుండానే శివ చాలా ఫీలవుతూ ప్రతీ సీన్స్ ని బాగా కనెక్ట్ అవుతూ ఫీల్ తో తీసాడు. నిజానికి స్క్రిప్ట్ ని పూర్తిగా ప్రేమించి ఓన్ చేసుకున్నాడు. కొంచెం ఎమోషనల్ సీన్ అనగానే శివ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించేవి. సినిమా చూసాక కథ చెప్పినట్లే అచ్ఛం అలాగే తీసాడని అనిపించింది. శివ తో పని చేయడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్.


ప్రతీ సినిమాలో అది కామనే..

ఈ మధ్య వరుసగా లవ్ స్టోరీస్ చేస్తున్నానని  అంటున్నారు. ‘భలే భలే మగాడివోయ్ ‘ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఆ తర్వాత వచ్చిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ చిన్నపిల్లలతో ఉండే అడ్వెంచర్ గేమ్. ‘జెంటిల్ మెన్’ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో ఇలా నేను రీసెంట్ గా చేసిన ప్రతీది ఏదో ఒక కొత్త సబ్జెక్ట్. ‘మజ్ను’ ఒక్కటే ఓన్లీ లవ్ స్టోరీ. సో ప్రతీ సినిమాలో ప్రేమ అనేది కామనే. ఎలాంటి సినిమా అయిన అందులో లవ్ ట్రాక్ ఉంటుంది కదా.. ‘దంగల్’ లాంటి కథల్లో తప్ప మిగతా అన్నిటిలో లవ్ కామనే. సో అలా నేను చేసిన అన్ని సినిమాల్లో లవ్ ట్రాక్ ఉండటం వల్ల వరుసగా మూడు నెలలకి ఓ సినిమా రావడంతో అలా కంపేర్ చేస్తున్నారని అనుకుంటున్నా. కానీ ‘నిన్ను కోరి’ లాంటి లవ్ స్టోరీ నేను ఇప్పటి వరకూ చేయలేదు.

దానికి రీజన్ అదే

కొన్ని సందర్భాలలో కొంత మంది ఏ విషయంలోనో బాగా హార్ట్ అయిపోయి డీప్ గా భాధ పడుతూ చిన్న ప్రాబ్లమ్ కె ఇంక మన లైఫ్ అయిపోయింది అన్నట్టు ఫీలవుతుంటారు. ఒక తెలియని నెగిటీవ్ ఆలోచనలోకి వెళ్లిపోతుంటారు. లైఫ్ అనేది ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల ఏ మాత్రం ఆగిపోయే చిన్న విషయం కాదు. లైఫ్ అనేది చాలా గొప్ప విషయం. అలాంటి భాధ ని పక్కకు తీసి పెట్టి కొత్త లైఫ్ చూడు అని చెప్పడానికే లెట్స్ వెల్ కం లైఫ్ అని టాగ్ లైన్ పెట్టడం జరిగింది.

అది అవసరమా అన్నారు

ఈ సినిమాకి మేజర్ హైలైట్ గోపి సుందర్ మ్యూజిక్. ‘అడిగా అడిగా’ సాంగ్ వినగానే ఆ పాట కి ఎంతో ఎట్రాక్ట్ అయిపోయా. అందుకే టీజర్, ట్రైలర్ కంటే ముందు ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం బాగా రీచ్ అవుతుంది అని ఫీలయ్యా. నేను చెప్పగానే మా టీంలో కొందరు ఇది ఫీల్ సాంగ్ కదా.. ఫస్ట్ ఇది రిలీజ్ చేస్తే చూస్తూ ఫీల్ అయ్యే సినిమా అనుకుంటారని అవసరమా.. అన్నారు. కానీ అందరం ఫైనల్ గా మళ్ళీ ఆలోచించి ఆ సాంగ్ రిలీజ్ చేసాం. మేం అనుకున్నట్టే ఆ సాంగ్ మిలియన్స్ వ్యూస్ అంటూ దూసుకెళ్లి సినిమా పై ఇంట్రెస్ట్ కలిగించింది. గోపి సుందర్ కి ఈ సందర్భంగా థాంక్స్.

అందులో తప్పేం లేదు

ఒక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ సినిమా విషయంలో ఇన్వాల్వ్ అవుతూ మనకి అనిపించిన ఇంప్రువైజేషన్స్ చేస్తుంటాం. అందులో తప్పేం లేదు. కొన్ని సినిమాలకు ఇంప్రూవ్ చేస్తున్నారు మారుస్తున్నారు రీ  షూట్ జరుగుతుంది అనే మాట వింటుంటే  అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి క్యూబ్ కి అప్లోడ్ అయ్యే వరకూ ఏవో కొన్ని చేంజెస్ చేయడం కామనే.

ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాదు

ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నారంతా.. కానీ ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కానేకాదు.. చాలా కొత్తగా ఉంటుంది. ఒక హీరో, హీరోయిన్, మరో హీరో అనే ఆలోచనే లేకుండా సినిమాలో కేవలం క్యారెక్టర్స్, కథ మాత్రమే కనిపిస్తాయి.

మరో ఛాన్స్ లేదు

ఈ కథ విన్నవెంటనే పల్లవి రోల్ కి నివేత, అరుణ్ రోల్ కి ఆది అని ఫిక్స్ అయిపోయాను. కథ విని ఇద్దరు వెంటనే ఒప్పుకున్నారు . ఇద్దరు చాలా బాగా చేశారు. ఈ సినిమా విషయం లో నటులుగా మార్కులు వేయమంటే ముందు నివేత కి ఆది కి వేసాకే నాకు వేసుకుంటాను. అంతలా ఆ క్యారెక్టర్స్ లో జీవించారు నివేత ఆది.

80 % అదే అలాగే ఉంటుంది..

టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమా బాగా ఎమోషనల్ గా , ఫీల్ గుడ్ మూవీ అనుకుంటున్నారు. కానీ అది కేవలం 20 % మాత్రమే మిగతా 80 % ఎంటర్టైన్మెంట్ తోనే ఉంటుంది. సరదాగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది.

ఆ టైం లో నా రియాక్షన్ అంతే..!

ఈ మధ్య ఓ ఫ్యాన్ పై రియాక్ట్ అయిన విధానం బాగాలేదని ఏవేవో అన్నారు. కానీ నాని ఫ్యాన్ అనే టాగ్ పెట్టుకొని ఇతర హీరోలను విమర్శిస్తూ, వల్గర్ గా కామెంట్ చేసే ఫాన్స్ నిజంగా నాకు వొద్దు. నిజానికి అది అసలు కరెక్ట్ కాదు.. ఫ్యాన్ అంటూ నా పిక్ పెట్టుకొని అలా కామెంట్స్ పెడుతుండడంతో  అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.. నిజానికి ఆ టైంలో నా రియాక్షన్ అంతే చెప్పాలనిపించింది చెప్పాను. రేపు నా ఫ్యాన్ అంటూ ఇంకేమైనా చేస్తే బాగోదు కదా.. సినిమాలని ప్రేమించాలి అందరినీ గౌరవించాలి అది నాకు ఇష్టం.


‘ఎం.సి.ఎ’ నుంచి గ్యాప్ తీసుకున్నాను

ప్రెజెంట్ చేస్తున్న ఎం.సి.ఎ సినిమా నుంచి ఒక 10 డేస్ గ్యాప్ తీసుకున్నా, ఈ గ్యాప్ లో ‘నిన్ను కోరి’ ప్రమోషన్స్ తో పాటు, రిలీజ్ తర్వాత సక్సెస్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా సెట్ లో కి వెళ్తా.

 

నెక్స్ట్ సినిమా అదే.

మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేయబోయే నెక్స్ట్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఉంటుంది. ఈ సినిమాతో మేర్లపాక గాంధీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది . ‘నిన్ను కోరి’ రిలీజ్ అయిన వారం రోజుల్లో ఆ సినిమా టైటిల్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనౌన్స్ చేస్తాం.

హను సినిమాలో అలా కనిపిస్తా..

హను రాఘవపూడి తో చేయబోయే సినిమా కంప్లీట్ గా డిఫరెంట్ మూవీ. ఆ సినిమాలో మిలటరీ క్యారెక్టర్ లో కనిపిస్తాను. చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉండే సినిమా అది. ఖచ్చితంగా నా నుంచి వచ్చే సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుంది.