నాని ఇంటర్వ్యూ

Wednesday,September 26,2018 - 01:53 by Z_CLU

నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ ‘దేవదాస్’. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో నాగ్, నాగార్జున ఫ్రెండ్స్ లా కనిపించనున్నారు. ఈ కాంబోకి సంబంధించిన స్టిల్స్ దగ్గరి నుండి, సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రిలీజైన విజువల్స్, ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నాని ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడాడు అవి మీకోసం…

అన్ని రకాలుగా…

‘దేవదాస్’ అన్ని రకాలుగా ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. నాగార్జున గారితో పని చేయడం ఫస్ట్ టైమ్, మల్టీస్టారర్ చేయడం కూడా ఫస్ట్ టైమ్..

ఆ ఫీలింగ్ ఉండేది…

ఏ హీరోతో అయినా మల్టీస్టారర్ చేయొచ్చు. కానీ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి టాప్ మోస్ట్ స్టార్స్ తో పని చేయాలంటే చిన్న బెరుకు ఉంటుంది. నాగ్ సర్ విషయంలో కూడా బిగినింగ్ లో ఆ ఫీలింగ్ ఉండేది…

ఫస్ట్ హాఫ్ లోనే…  

షూటింగ్ స్టార్టింగ్ లోనే సాంగ్ షూట్ చేశాం. అది చాలా ఈజీగా అయిపొయింది. కానీ  ఎప్పుడైతే సీన్స్ షూట్ చేయడం స్టార్ట్ చేశామో, ఆ రోజు హాఫ్ డే నుండే, మా ఇద్దరి మధ్య మంచి ఈజ్ క్రియేట్ అయింది. అంత పెద్ద స్టార్ అని కానీ, అంత ఎక్స్ పీరియన్స్ ఉన్న యాక్టర్ అనే ఫీల్ అన్ని పోయి, సేమ్ ఏజ్ గ్రూప్ హీరోతో పని చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది.

ఏది చెప్పినా…

హిలేరియస్ ఎంటర్ టైనర్ కాబట్టి, ఆబివియస్ గా ఆన్ లొకేషన్ లో చాలా ఇంప్రువైజేషన్స్ ఉంటాయి. స్పాట్ లో అక్కడ ఉన్న మూడ్ ని బట్టి, ప్రాప్ ని బట్టి చాలా మారిపోతుంటాయి. నాగ్ సర్ కి ఏ ఐడియా చెప్పినా, హ్యాప్పీగా నవ్వేసి దాన్ని ఇంకా ఇంప్రువైజ్ చేసి ఎంకరేజ్ చేసేవారు…

ఎప్పటికీ పోదు…

ఇంత పెద్ద సినిమా కలిసి చేశాం. నాగ్ సర్ దగ్గర నాకు మంచి చనువు వచ్చేసింది. అయినా ఆయన అక్కడి నుండి వస్తుంటే, ఆయన సినిమా టికెట్ల కోసం ట్రై చేయడం, దొరకవేమో అని టెన్షన్ పడటం.. అవే గుర్తొస్తాయి.. ఆ ఫీల్ ఎప్పటికీ పోదు…

గ్యారంటీ ఇవ్వలేదు…

శ్రీరామ్ ఆదిత్యకు కథ అప్పజెప్పేటప్పుడు మా దగ్గర 20% మాత్రమే ఉంది. స్టోరీ డెవెలప్ చేయమని తనకు అప్పజెప్పేటప్పుడు కూడా, ఈ సినిమా 100% చేస్తామని గ్యారంటీ ఇవ్వలేదు.

అది జరిగింది..

స్టోరీ నచ్చకపోతే వేరే విషయం కానీ, ఓకె..పర్వాలేదు అనిపించినా ఈ సినిమా చేయం, అవుట్ స్టాండింగ్ అనిపిస్తేనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని శ్రీరామ్ ఆదిత్య కి  బిగినింగ్ లోనే క్లారిటీ ఇచ్చా…

40 రోజుల తర్వాత

శ్రీరామ్ ఆదిత్య కథ మొత్తం రెడీ అయ్యాక ఫస్ట్ చెప్పింది నాకే. ఇమ్మీడియట్ గా స్వప్నకు  చెప్పా… ఈ సినిమా చేయకపోతే సిన్సియర్ గా తను 40 రోజులుగా పడ్డ కష్టం వేస్టయిపోతుందని చెప్పా… ఆ తరవాత నాగ్ సర్ కూడా స్టోరీ విని చాలా ఎగ్జైటెడ్ అయ్యారు…

నేనది కాదు…

నా కటౌట్ చూసి ఆడియెన్స్ నా సినిమాకి రారు… నాకా క్లారిటీ ఉంది. సినిమాని ఎంజాయ్ చేయడానికి వస్తారు. నాకంటూ నా చుట్టూరా నాకో ఇమేజ్ నేనెప్పుడూ క్రియేట్ చేసుకోలేదు.. అలాంటప్పుడు మల్టీస్టారర్ అంటే రిస్క్ అనే ఆలోచన నాకెప్పుడూ లేదు.

అసలు విషయం అది..

ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్  ఇండస్ట్రీకి వచ్చి, చిన్న చిన్నగా సినిమాలు చేసుకుంటున్న నాతో సినిమా చేయడానికి నాగార్జున లాంటి స్టారే ఆలోచించనప్పుడు, నేను మాత్రం ఎందుకు ఆ ఆఫర్ రెఫ్యూజ్ చేస్తాను. ఆయనతో పని చేసే అవకాశం దొరకడం నిజంగా అదృష్టం..

నాకైతే సరిపోయింది…

ఒక ఈవెంట్ లో నాగార్జున ‘నాని’ అంటే నాకిష్టం అని చెప్పుకున్నారు. అప్పుడు అమల గారైతే నాగ్ సర్ మాట్లాడుతున్నా, మధ్యలో వచ్చి అసలు తెలుగెంత బాగా మాట్లాడతాడు… చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేస్తాడు అని చెప్పారు… నాకా కాంప్లిమెంట్ సరిపోయింది.

 

నా టార్గెట్ అదే…

నాగ్ సర్ దృష్టిలో నాపై ఉన్న ఇంప్రెషన్ పోకూడదు. ఆ ఈక్వేషన్స్ మారకూడదు. అదొక్కటే ఉండేది మైండ్ లో. కానీ ఎప్పుడైతే ఆయన రషెస్ చూసి, చాలా బాగా చేశావ్ నాని అన్నారో… రిలాక్స్ అయిపోయా… ఈ సినిమా రిలీజ్ తరవాత ఇంకెంతమంది అప్రీషియేట్ చేసినా, నాగ్ సర్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం నాకు చాలా స్పెషల్…

కొత్తగా మీసాలు…

మీసాలతో ఇప్పటి వరకు నేను ఏ సినిమాలో నటించలేదు. ఈ సినిమా వరకు వచ్చేసరికి, అప్పుడే సిటీకి వచ్చి ఒక పెద్ద హాస్పిటల్ లో జాయిన్ అయ్యే ఒక యంగ్ డాక్టర్ లా కనబడాలి, చాలా లుక్స్ ట్రై చేశాం, అందరికీ ఇదే నచ్చేసింది, ఫిక్సయ్యాం.

ఆయనతో ఫస్ట్ టైమ్…

దత్ గారితో కలిసి పని చేయడం నాకిదే ఫస్ట్ టైమ్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చేసినా ఆయనతో ఇంటరాక్ట్ అయింది తక్కువే. కానీ ఆ సినిమా తరవాత ప్రతి సినిమా రిలీజ్ తరవాత ఆయన నుండి కాల్ కంపల్సరీగా వస్తుంది. అట్లీస్ట్ మెసేజ్ అయినా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద ప్రొడ్యూసర్ లా ఉండవు ఆయన ఆమాటలు, సినిమాని ఇష్టపడే వ్యక్తిలా మాట్లాడతారు.

అర్థమైంది…

అసలు వైజయంతీ బ్యానర్ కి ఇంత రెస్పెక్ట్ ఎందుకు..? ఎందుకు ఇంత పెద్ద స్టార్స్ ఈ బ్యానర్ లోనే ఇంట్రడ్యూస్ అయ్యారు అనే క్వశ్చన్ ఉండేది. ఆయనతో పని చేశాక నాకు బాగా క్లారిటీ వచ్చేసింది.

అంతకు మించి…

ఏదైనా ఒకటి అడిగామంటే దానికి నెక్స్ట్ లెవెల్ లో ఇద్దామని చూస్తారు. వైజయంతీ అంటే ఆయన దృష్టిలో గ్రాండియర్. ప్రతీది గ్రాండియర్ గా ప్రెజెంట్ చేయాలనే తాపత్రయపడుతుంటారు. సెట్ లో అందరూ ఆయనకు ఫ్యామిలే మెంబర్సే.

జెర్సీ…

ఈ సినిమా కోసం వర్కవుట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి.  విజయదశమికి షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇది డెఫ్ఫినేట్ గా వన్ ఆఫ్ మై మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ అవుతుంది. చిన్న డీటేల్ కూడా వదలకుండా 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాం ఈ సినిమాని.

నేనే విన్నర్ ని…

‘జెర్సీ’ తర్వాత టాలీవుడ్ సెలెబ్రిటీ  క్రికెట్ లీగ్ లో ఆడితే, నేనే విన్నర్ అవుతా… అంత ప్రాక్టీస్ చేస్తున్నా ఈ సినిమా కోసం. డేనియల్ క్రికెట్ కోచింగ్ ఇన్స్ టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నా. ప్రొఫెషనల్ క్రికెటర్ ని చూస్తారు ఈ సినిమాలో…