విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని?

Saturday,November 03,2018 - 02:59 by Z_CLU

లెక్కప్రకారం, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయాలి. దేవదాస్ సినిమా కంటే ముందే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ పై చర్చ మొదలైంది. ఈసారి మూవీ ఫైనల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి

నా పేరు సూర్య తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ వైపు ఇంట్రెస్ట్ చూపించాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. సో.. విక్రమ్ కుమార్ ఇప్పుడు నాని వైపు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం జెర్సీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయితే తప్ప, విక్రమ్ కుమార్-నాని కాంబోపై క్లారిటీ రాదు.