మణిరత్నం దర్శకత్వంలో నేచురల్ స్టార్

Saturday,September 09,2017 - 10:54 by Z_CLU

మణిరత్నంతో వర్క్ చేయాలన్నది నాని డ్రీమ్. మణిరత్నం వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తే చాలనుకున్నాడు కెరీర్ స్టార్టింగ్ లో. అలాంటి నానికి ఇప్పుడు అతడి దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. అవును.. త్వరలోనే మణిరత్నం దర్శకత్వంలో నాని హీరోగా నటించబోతున్నాడు.

ఇదొక మల్టీస్టారర్ మూవీ. గతంలో మణిరత్నం తీసిన యువ సినిమా స్టయిల్ లో పారలల్ స్టోరీస్ తో సాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మలయాళం హీరో ఫహాజ్ ఫాజిల్ ను ఓ హీరో క్యారెక్టర్ కోసం తీసుకున్నాడు. ఇప్పుడు మరో హీరోగా నాని పేరు ఫైనల్ అయింది. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ సేతుపతితో చర్చలు సాగుతున్నాయి. అది కూడా ఓకే అయితే.. ముగ్గురు హీరోలతో 3 భాషల్లో మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వస్తుంది.

నిజానికి చెలియా సినిమా కంటే ముందు ఈ ప్రాజెక్టునే హ్యాండిల్ చేయాలనుకున్నాడు మణిరత్నం. కానీ మహేష్ బాబు, నాగార్జున, మాధవన్ లాంటి భారీ తారాగణంతో అప్పట్లో ఈ స్టోరీ ప్లాన్ చేశాడు. అది వర్కవుట్ కాలేదు. సో.. ఇప్పుడిలా నాని, విజయ్ సేతుపతి లాంటి హీరోలతో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.