కళ్యాణ్ రామ్ తో నాని సినిమా

Tuesday,July 25,2017 - 11:58 by Z_CLU

సక్సెస్ గ్యారంటీ హీరో అనిపించుకుంటున్న నానితో సినిమా చేయాలని ప్లాన్ లో చాలా మంది ప్లాన్ లో ఉన్నారు. అయితే ఇప్పుడా క్యూలో కళ్యాణ్ రామ్ కూడా చేరాడు. ప్రస్తుతం MCA సినిమాతో సెట్స్ పై ఉనన్ నాని, కళ్యాణ్ రామ్ NTR ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాకి సంతకం చేశాడనే ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రసుతం MCA సినిమాతో సెట్స్ పై ఉన్న నాని, ఇప్పటికే మెరపక గాంధీ డైరెక్షన్ లో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాని ఆగష్టు నుండి సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరవాత నాని ‘కళ్యాణ్ రామ్’ ప్రొడక్షన్ లో సినిమాకి డిస్కషన్స్ నడుస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ, ఫ్యాన్స్ మాత్రం కళ్యాణ్ రామ్ , నాని కాంబినేషన్ లో సినిమా తీయబోయే డైరెక్టర్ ఎవరై ఉంటారా..? అనే డిస్కషన్స్ లో పడ్డారు. ఈ సస్పెన్స్ కి బ్రేక్ పడాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకు ఆగాల్సిందే.