Ante Sundaraniki బర్త్ డే టీజర్ తో నవ్వించాడు

Wednesday,February 23,2022 - 04:37 by Z_CLU

Nani Impressed with ‘Ante Sundaraniki’ Birthday Glimpse

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికి’ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాని పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేసేలా ఫస్ట్ కంటెంట్ వదిలారు. సుందర్ పుట్టిన రోజు నాడు ఇంట్లో జరిగే హోమం నుండి ఒక సన్నివేశం తీసుకొని దానితో నానికి బర్త్ డే విషెస్ చెప్పారు.

నానిలో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఇది నాని సినిమాల్లో చాలా వరకూ సక్సెస్ ఫ్యాక్టర్. ఈ సినిమాలో కూడా ఆ టైమింగ్ తో హిలేరియస్ గా నవ్వించనున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ” పుట్టిన రోజు ఏంటే ఇది .. ఇంకా ఎన్ని హోమాలు చేయాలి ” అంటూ దీపం చేతిలో పట్టుకొని నడుస్తూ సుందర్ అడగ్గానే తల్లి పాత్రలో నటించిన రోహిణీ “నీకు అన్ని గండాలున్నాయట మరి” అని చెప్తూ వారిద్దరి మధ్య వచ్చే కన్వర్జేషన్ తో బర్త్ డే గ్లిమ్స్ ని కట్ చేశారు. చివర్లో అంటే సుందరానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ నేచురల్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. టీజర్ లో నాని డైలాగ్ , వివేక్ సాగర్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి.

ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. టీజర్ ఎండింగ్ లో సినిమా జూన్ 10న థియేటర్స్ లోకి రానుందని రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. నాని సరసన నజ్రియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics