Nani - బ్రేక్ తీసుకున్న నేచురల్ స్టార్

Friday,December 18,2020 - 05:01 by Z_CLU

మహేష్ బాబు వెకేషన్ కు వెళ్లడం చాలా కామన్. నాగచైతన్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ కూడా అప్పుడప్పుడు హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నాని ఇలా బ్రేక్ తీసుకోవడం చాలా తక్కువ. ఇతడికి సినిమాలే లోకం.

అలాంటి నాని కూడా ఈసారి బ్రేక్ తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి గోవా వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే రిలాక్స్ అవుతున్నాడు.

టక్ జగదీష్ షూటింగ్ ను ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చాడు నాని. త్వరలోనే శ్యామ్ సింగరాయ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ గ్యాప్ లో కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలని డిసైడ్ అయి, గోవా వెళ్లాడు.

గోవా ట్రిప్ పూర్తయిన వెంటనే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తాడు నాని. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఉన్న సినిమాలన్నీ 2021లో వరుసగా రిలీజ్ కాబోతున్నాయి.