Dasara Movie నాని క్లారిటీ

Friday,January 27,2023 - 01:46 by Z_CLU

Nani gives a clarity on Dasara movie rumour

నాని (Nani) నుండి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘దసరా’ (Dasara) పై భారీ అంచనాలున్నాయి. నాని కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా దసరా తెరకెక్కుతుంది. అయితే ఈ మధ్య ప్రతీ సినిమాకు జరుగుతున్నట్టే దసరా కి కూడా ఓ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 గా ఉండనుందనే జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ విషయంపై నాని క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు. జస్ట్ వన్ అంటూ దసరా కి రెండో పార్ట్ లేదని క్లారిటీ ఇచ్చేశాడు. కాకపోతే దసరాలో డబుల్ పవర్ ఉంటుందనే హింట్ ఇచ్చాడు.

నాని ఇచ్చిన క్లారిటీతో దసరా రెండు పార్ట్స్ కాదని ఒకే ఒక్క భాగంగా రానుందని ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ బేనర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఐదు భాషల్లో మార్చ్ 30 న రిలీజ్ కానుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics