నాని లిస్ట్ లో మరో సూపర్ హిట్...

Sunday,July 09,2017 - 11:16 by Z_CLU

టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ నేచురల్ స్టార్ గా దూసుకుపోతున్న నాని మరో సూపర్ హిట్ ను తన లిస్ట్ లో వేసుకున్నాడు. లేటెస్ట్ గా ‘నిన్ను కోరి’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన నాని ఈ సినిమాతో భారీ సందడి చేస్తూ బాక్సాఫీస్ దగ్గర గట్టి వసూళ్లు  రాబడుతున్నాడు.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తో మొదలు పెట్టి ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ ,’కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’,’జెంటిల్ మెన్’,’మజ్ను’ ఇలా వరుస సినిమాలతో బ్యాక్ బ్యాక్ టు సూపర్ హిట్స్ అందుకున్న నాని ‘నేను లోకల్’ తో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఈ వరుస విజయాల తర్వాత నాని నుంచి వస్తున్న’నిన్ను కోరి’ నాని విజయ పరంపరను కొనసాగిస్తుందా..లేదా..అనే డౌట్ కి రిలీజ్ రోజే ఆన్సర్ ఇచ్చేశాడు నాని. లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్నాడు నేచురల్ స్టార్. సో బ్యాక్ టు బ్యాక్ 7 సూపర్ హిట్స్ తో సరి కొత్త ట్రెండ్ సృష్టించిన నాని ఈ సక్సెస్ బాటను ఇలాగే కంటిన్యూ చేస్తాడో..లేదో..చూడాలి.