ఫ్యాన్స్ తో నాని చిట్ చాట్

Tuesday,July 11,2017 - 12:15 by Z_CLU

‘నిన్ను కోరి’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నేచురల్ స్టార్ నాని మరో హిట్ కొట్టిన సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

భయపెట్టే సినిమాలు చేయను

ప్రతి  సినిమాలో వేరియేషన్ ఉండేలా చూసుకుంటాను. కాస్త కొత్తగా ఎంటర్ టైన్ చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. కుదిరితే ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయాలనుంది. కచ్చితంగా చేస్తా. హారర్ మూవీస్ చూస్తాను కానీ అలాంటి కథల్లో నటించను. ఎందుకో ఆ జానర్ పెద్దగా ఇష్టం ఉండదు.

 

అది మనకి సంబంధం లేని మేటర్

నా సినిమాలు బాగా కలెక్ట్ చేస్తున్నాయని దీనిపై మీ రెస్పాన్స్ ఎలా ఏంటని అడుగుతున్నారు. నేను నటుడ్ని, మీరు ప్రేక్షకులు. మనకు సినిమానే లోకం. మధ్యలో ఈ వసూళ్ల లెక్కలు మనకెందుకండి.

సిక్స్ ప్యాక్ చేస్తా.. కానీ..

ఈ సిక్స్ ప్యాక్స్ మనకెందుకండి. ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ చేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. నేను చేయను కూడా. కాకపోతే కథకు, క్యారెక్టర్ కు అవసరం అనుకుంటే కచ్చితంగా చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మిలట్రీ బ్యాక్ డ్రాప్ తో వచ్చే ఓ సినిమాకు సిక్స్ ప్యాక్ అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తా.

ఆయనతో కంపేర్ చేయడం నా అదృష్టం

వెంకటేష్ గారితో నన్ను పోల్చడం చాలా ఆనందంగా ఉంది.. చిన్నప్పుడు ఆయన సినిమాలే ఎక్కువగా చూసేవాడిని. ఇప్పటికీ నా ఆల్ టైం ఫేవరెట్ సినిమాల్లో ఎక్కువ వెంకటేష్ గారివే ఉంటాయి. అలాంటి హీరోతో నన్ను పోల్చడం నిజంగా నా అదృష్టం.

అందుకే వరుసపెట్టి సినిమాలు

తొందరగా సినిమాలు చేయడానికి కారణం ఆడియన్స్ తో ఎక్కువ గ్యాప్ ఉండకూడదనే. ప్రేక్షకుల్ని ఎక్కువ సార్లు కలవాలి.  వాళ్లకు వీలైనంత దగ్గరగా ఉండాలి. కొత్తగా ఏదో ఒకటి చూపించాలి. అందుకే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి.

 

అది కేవలం సరదా కోసమే..

నిన్ను కోరి సినిమా క్లైమాక్స్ లో ఫేస్ బుక్ లో చాట్ చేసి త్వరలోనే కలుస్తా అనేది కేవలం ఆ సినిమాకే పరిమితం. జస్ట్ ఏదో క్లైమాక్స్ లో చిన్న ఫన్ కోసం అలా పెట్టాం. రియల్ లైఫ్ లో ఎవరితో చాట్ చేయలేదు.. కలవలేదు.. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం లేవు..

చిరంజీవి సినిమా రీమేక్ లో..

‘చంటబ్బాయ్’ రీమేక్ చేయాలనే కోరిక ఉంది. పాత అగ్నిపథ్ కూడా తెలుగులో చేయాలని ఉంది. కానీ అవి చేస్తానో లేదో మాత్రం తెలియదు. అన్ని కుదిరితే కచ్చితంగా ఈ సినిమాలు రీమేక్ చేస్తా.

ఎప్పటి కైనా మణిరత్నంతో సినిమా

ఒక సాధారణ ప్రేక్షకుడిగా మాత్రమే కథ వింటాను.. నాకు నచ్చితే ప్రేక్షకులకు నచ్చుతుందని గట్టిగా నమ్ముతాను.. ఇన్నాళ్లు అలానే స్క్రిప్ట్స్ ఓకే చేశాను. ఇక నా ఫెవరెట్ డైరక్టర్ మణిరత్నం గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఎప్పటికైనా ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తా.

త్వరలోనే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్

నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను కూడా ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనం కోసం ట్రై చేస్తాను. ఇందులో బాగంగా కంప్లీట్ యాక్షన్ సినిమా ఒకటి చేస్తాను. త్వరలోనే అలాంటి స్క్రిప్ట్ తో సినిమా చేస్తాను.

నా దృష్టిలో ప్రభాస్, రవితేజ..

నా ఫెవరెట్ లిస్ట్ లో ప్రభాస్, రవితేజ అన్న ఇద్దరు ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ జెన్యూన్ అనే పదానికి ఎగ్జాంపుల్. ప్రభాస్ అంత నిజాయితీ గల వ్యక్తిని ఇప్పటి వరకూ చూడలేదు. ఇక రవితేజ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను ఎక్స్ ట్రా పవర్ బ్యాటరీ లాంటి వ్యక్తి.

 

అలాంటి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్

మల్టీస్టారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ తెలుగులో ఎందుకో మల్టీస్టారర్ స్క్రిప్ట్స్ ఎక్కువగా రావు. కొన్నిసార్లు ఎప్రోచ్ అయినా కార్యరూపం దాల్చవు. నాకు మాత్రం త్వరలోనే ఓ మల్టీస్టారర్ చేయాలని ఉంది. అలాంటి స్క్రిప్ట్స్ కోసం వెయిటింగ్.

ఈ వారంలోనే కొత్త సినిమా ప్రకటన

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘ఎం.సి.ఎ’ సినిమా చేస్తున్నాను. త్వరలోనే మేర్లపాక గాంధీ డైరక్షన్ లో ఓ సినిమా ఉంటుంది. అది చాలా డిఫరెంట్ ఎంటర్టైనర్. ఈ సినిమాతో మేర్లపాక గాంధీ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతున్నాడు. ఈ వారంలోనే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటు డీటెయిల్స్ చెప్తాం