పంథా మార్చుకున్న నాని

Sunday,February 24,2019 - 05:40 by Z_CLU

యంగ్ హీరో నాని పంథా మార్చుకొని సినిమాలు చేస్తున్నాడు. 2017 వరకూ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ ఏడాదికి మూడు సినిమాలతో సందడి చేసిన నేచురల్ స్టార్ ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలతో సరిపెడుతున్నాడు. గతేడాది ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాసు’ సినిమాలతో హంగామా చేసిన నాని ఈ ఏడాది కూడా రెండు సినిమాలు మాత్రమే అందించబోతున్నాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జెర్సీ’ ఏప్రిల్ లో విడుదల కానుండగా , విక్రం కుమార్ తో చేయబోయే సినిమా ఏడాది చివర్లో థియేటర్స్ లోకి రానుంది.

రెండేళ్ళ క్రితం ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ పై పెట్టి కంప్లీట్ చేసిన నాని ప్రస్తుతం ఒక సినిమా ఫినిష్ అయ్యాకే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. కాస్త స్పీడ్ తగ్గించి మంచి ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మరి వచ్చే ఏడాది కూడా నాని ఇదే ప్లాన్ తో కెరీర్ ని కొనసాగిస్తాడా …లేదా.. చూడాలి