బర్త్ డే స్పెషల్: జెర్సీ నుంచి మరో లుక్

Sunday,February 24,2019 - 01:48 by Z_CLU

నేచురల్ స్టార్ నాని ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ మొత్తం నానికి శుభాకాంక్షలు అందిస్తోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ప్రస్తుతం నానితో సినిమా చేస్తున్న సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మాతలు, అతడికి ప్రత్యేకంగా విశెష్ అందించారు. పనిలో పనిగా జెర్సీ సినిమాకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ రిలీజ్ చేశారు.

జెర్సీ సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు నాని. ఇందులో ఒకటి యంగేజ్ క్యారెక్టర్ అయితే, ఇంకోటి లేటు వయసులో క్రికెటర్ గా క్లిక్ అయ్యే పాత్ర. ఈ రెండో పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు నాని. ఏకంగా 2 నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేసి మరీ సెట్స్ పైకి వచ్చాడు.

నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా నటించిన జెర్సీ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పనోరమ స్టుడియోస్ ఈ సినిమాను నార్త్-ఇండియాలో రిలీజ్ చేస్తుంటే.. బ్లూ స్కై సినిమాస్ సంస్థ ఓవర్సీస్ లో విడుదల చేస్తోంది.