నాని ‘కృష్ణార్జున యద్ధం’ బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజెస్

Saturday,January 13,2018 - 04:32 by Z_CLU

నాని సంక్రాంతి పండక్కి ఫ్యాన్స్ కోసమని ధమాకా ప్లాన్ చేశాడు. 3 రోజుల పాటు జరిగే ఈ పండగకి వరసగా 3 రోజులు సరికొత్త సర్ ప్రైజెస్ ని ఫిక్స్ చేశాడు న్యాచురల్ స్టార్. రేపటి నుండి ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్స్ తో పాటు ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనుంది ‘కృష్ణార్జున యుద్ధం’ టీమ్.

ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపు ఈ సినిమాలో ‘కృష్ణ’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్, 15 న అర్జున్ ఫస్ట్ లుక్, ఇక 16 న కనుమ సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ అప్ డేట్ నాని ఫ్యాన్స్ లో పండగ ఎగ్జైట్ మెంట్ డోస్ ని రెండింతలు చేస్తుంది.

మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హిపాప్ తమీజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలు.