2 కంట్రీస్ ఆడియో రిలీజ్ చేసిన నాని

Thursday,December 14,2017 - 04:49 by Z_CLU

సునీల్ ‘2 కంట్రీస్’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా శంకర్ డైరెక్షన్ లో అదే టైటిల్ తో తెరకెక్కింది. డిసెంబర్ 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా, నిన్న ఆడియో రిలీజ్ జరుపుకుంది. ఈ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.

ఈ సందర్భంగా నాని తనకు సునీల్ కి ఉన్న రిలేషన్ షిప్ ని గుర్తు చేసుకుంటూ ‘ కరియర్ బిగినింగ్ లో ‘ఢీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వడానికి సునీల్ తనకు హెల్ప్ చేశాడని చెప్పుకున్నాడు. 2 కంట్రీస్ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆల్ రెడీ హిట్టయిన సినిమా. కథ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక కామెడీ విషయానికి వస్తే సునీల్ ఏ రేంజ్ లో ఇరగదీస్తాడో మనందరికీ తెలిసిందే’ అన్నాడు.

గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో సునీల్ సరసన మనీషా హీరోయిన్ గా నటిస్తుంది. ఒక టిపికల్ ఇండియన్ అబ్బాయికి ఫారిన్ అమ్మాయితో పెళ్ళైతే క్రియేట్ అయ్యే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో బోలెడంత ఫన్ జెనెరేట్ చేస్తుంది. సునీల్ బాడీ లాంగ్వేజ్ కి మ్యాచ్ అయ్యే హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు, సినిమాలో కీ రోల్స్ ప్లే చేసిన నరేష్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ హైలెట్ గా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.