ఫలక్ నుమా హీరోతో నాని సినిమా

Tuesday,May 28,2019 - 12:05 by Z_CLU

నాని కేవలం ఓ హీరో మాత్రమే కాదు. అతడొక నిర్మాత కూడా. వాల్ పోస్టర్ అనే బ్యానర్ ను పెట్టి తన నిర్మాణంలో ‘అ!’ అనే సినిమా కూడా తీశాడు నాని. ఆ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నాని, మళ్లీ ఇన్నాళ్లకు తన బ్యానర్ పై రెండో సినిమా ఎనౌన్స్ చేశాడు.

నటుడు విశ్వక్ సేన్ హీరోగా కొత్త సినిమా ప్రకటించాడు నాని. విశ్వక్ నటించిన ఫలక్ నుమా దాస్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన నాని, ఈ విషయాన్ని తనే స్వయంగా ఎనౌన్స్ చేశాడు.

సినిమాకు సంబంధించి అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ ను బయటపెట్టలేదు నాని. గ్యాంగ్ లీడర్ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత నాని మరోసారి నిర్మాతగా మారే ఛాన్స్ ఉంది.