విజయ్ దేవరకొండ డైరెక్టర్ తో నాని సినిమా !

Wednesday,January 22,2020 - 05:03 by Z_CLU

ప్రస్తుతం ‘V’ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసిన నాని నెక్స్ట్ శివ నిర్వాణ డైరెక్షన్ లో 26 వ సినిమాగా ‘టక్ జగదీశ్’ చేయబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు లేటెస్ట్ గా మరో సినిమాను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు నాని.

‘టాక్సీ వాలా’ ఫేం రాహుల్ సంక్రిత్యన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.