నందితా శ్వేత కొత్త సినిమా ఫస్ట్ లుక్

Wednesday,March 06,2019 - 02:55 by Z_CLU

నందితా శ్వేత కొత్త సినిమా ‘IPC 376’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజయింది. పవర్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందిత పోలీసాఫీసర్ గా కనిపించనుంది. రామ్ కుమార్ సుబ్బరామన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రస్తుతానికయితే ఈ సినిమాకి సంబంధించి డీటేల్స్ ఇంకా రివీల్ కాలేదు కానీ, ఒక మోస్ట్ ఇంటెన్సివ్ క్రైమ్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ అని తెలుస్తుంది.  ఈ సినిమాలో నందితా శ్వేత తో పాటు నటిస్తున్న తక్కిన స్టార్ కాస్ట్ డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై S. ప్రభాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన నందితా శ్వేత ఆల్మోస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలనే ఎంచుకోవడం విశేషం. ఇప్పటికే ‘ప్రేమకథా చిత్రమ్ 2’ తో పాటు ‘అక్షర’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న మరో థ్రిల్లర్ లో నటిస్తుందీ నందిత. ఒక్క కమర్షియల్ హీరోల సరసన నటించట్లేదనే లోటు తప్ప, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది నందిత.