దెయ్యానికి కేరాఫ్ అడ్రస్

Tuesday,May 21,2019 - 10:02 by Z_CLU

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైంది ‘నందితా శ్వేత’. ఇప్పుడున్న కాంటెంపరరీ హీరోయిన్స్ లో చాలా బిజీగా ఉన్న హీరోయిన్. పరిచయమవ్వడమే ఆత్మ ఆవహించిన రోల్ లో పరిచయమైంది. ఇప్పుడు కూడా దెయ్యం బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలతోనే బిజీగా ఉంది.

నందితా శ్వేత కరియర్ లో ఒక్క స్టార్ హీరో సరసన కూడా నటించలేదు. బిగినింగ్ నుండి తను ఎంచుకుంటున్న సినిమాల స్ట్రాటజీనే వేరు.. ఈ ప్రాసెస్లో అక్కడక్కడా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా సంతకం చేస్తుంది. కానీ వీటిలో దెయ్యం బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా సినిమాలున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే దెయ్యం బ్యాక్ డ్రాప్ లో ఉన్న మ్యాగ్జిమం సినిమాల్లో నందితా శ్వేత నటిస్తుంది.    

రీసెంట్ గా రిలీజైన ‘ప్రేమకథా చిత్రమ్ 2’ లో నటించింది నందితా శ్వేత. మనం భయపడటానికి రెడీగా ఉండాలి కానీ సినిమాలో నందిత శ్వేత తన పర్ఫామెన్స్ తో ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న ‘అభినేత్రి 2 లో కూడా అలాంటి ‘పవర్ ఫుల్’.. అదే మోస్ట్ హారర్ ఎలిమెంట్స్ ఉన్న రోల్ లో కనిపించనుంది నందితా శ్వేత.

ఏది ఏమైనా హారర్ కథ అనుకుని దర్శకులు పేపర్ పై పెన్ను పెడుతున్నారో లేదో, దెయ్యం ప్లేస్ లో నందితా శ్వేతనే ఊహించుకుంటున్నారు. అలా దెయ్యానికి కేరాఫ్ అడ్రస్ లా మారింది నందిత శ్వేత.