నందిత శ్వేత లీడ్ రోల్ లో 'అక్షర' ప్రారంభం

Saturday,November 17,2018 - 03:39 by Z_CLU

పరిచయం అక్కర్లేని హీరోయిన్ నందిత శ్వేత. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాలో ఈమె యాక్టింగ్ స్కిల్స్ కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి తనలోని యాక్టింగ్ స్కిల్స్ చూపించబోతోంది ఈ ముద్దుగుమ్మ. నందిత శ్వేత లీడ్ రోల్ లో అక్షర సినిమా ప్రారంభమైంది.

ఈరోజు అన్నపూర్ణ స్టుడియోస్ లో గ్రాండ్ గా లాంఛ్ అయింది ఈ సినిమా. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఓపెనింగ్ రోజునే సినిమా థీమ్ ను తెలుపుతూ, కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సినిమాహాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి కలిసి నిర్మించబోతున్నారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల నుంచి మొదలవుతుంది.