అల్లరోడు మొదలెట్టేసాడు

Tuesday,May 26,2020 - 01:09 by Z_CLU

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం సైలెంట్ గా జరిగిపోతుంది. ఇప్పుడు ఆ లిస్టులో అల్లరి నరేష్ ‘నాంది’ కూడా చేరింది. ఇటివలే సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసారు. షూట్ చేసిన వర్షన్ వరకు ఎడిటింగ్ పూర్తవ్వడంతో ఇప్పుడు ఆ పార్ట్ కి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.

తాజాగా డబ్బింగ్ మొదలు అంటూ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ను డిఫరెంట్ యాంగిల్ లో చూస్తారని అంటున్నారు యూనిట్.

సతీష్ వేగేశ్న నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తుండగా అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.