సూపర్ స్టార్ చిత్రం లో నందమూరి హీరో ?

Monday,July 25,2016 - 05:07 by Z_CLU

 

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం `మనమంతా`.ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగ‌స్టు 5న విడుదల కు సిద్ధమైంది. సీనియ‌ర న‌టి గౌత‌మి స‌హా గౌతమి, విశ్వాంత్, రైనా రావులు తదితరులు నటించిన ఈ చిత్రం లో నందమూరి హీరో తారక రత్న ఒక గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నలుగురు వ్యక్తుల కథ తో తెరకెక్కిన మ‌న‌మంతా చిత్రం లో ఓ కీలక సందర్భం లో ఈ హీరో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి అలరిస్తాడని ఫిలిం నగర్ టాక్..