NBK107 షూటింగ్ అప్ డేట్స్

Wednesday,July 06,2022 - 04:55 by Z_CLU

Nandamuri Balakrishna’s ‘NBK107’ Shooting details

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘NBK107’. ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యుల్ టర్కీలో జరగనుందని తెలుస్తుంది. నిజానికి యూనిట్ ముందుగా ఈ షెడ్యుల్ ని అమెరికా లో ప్లాన్ చేసుకున్నారట. కానీ యూనిట్ అందరికీ వీసా దొరకని కారణంగా షెడ్యుల్ ని టర్కీ కి మార్చుకున్నారని సమాచారం.

సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. కథ సగభాగం పైనే అమెరికాలో జరుగుతుందని ఇన్సైడ్ టాక్. ఆ పోర్షన్ ని టర్కీలో షూట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ సిస్టర్ కేరెక్టర్ ప్లే చేస్తుంది. కన్నడ నటుడు విజయ్ దునియా విలన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య , క్రాక్ తర్వాత గోపీచంద్ నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics