#NBK107 First Hunt బాలయ్య మాస్

Thursday,June 09,2022 - 06:50 by Z_CLU

Nandamuri Balakrishna’s ‘NBK107’ First Hunt Released

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK107 సినిమా నుండి ఫస్ట్ హంట్ అంటూ టీజర్ రిలీజైంది. బాలయ్య నుండి అభిమానులు అలాగే ప్రేక్షకులు ఏం కోరుకుంటారో సరిగ్గా అలాంటి కంటెంట్ తో గోపీచంద్ ఈ సినిమా చేస్తున్నాడని టీజర్ తో చెప్పేశాడు. ముఖ్యంగా బాలయ్య మార్క్ డైలాగులు , యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో దండుగా ఉంటాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్ స్టార్టింగ్ షాట్స్, ఆ తర్వాత బాలయ్య వాకింగ్ చేస్తూ వచ్చే బ్యాక్ షాట్ , చుట్ట నోట్లోకి ఎగరేసే షాట్ ఆ వెంటనే “నీ జీఓ గవర్న్ మెంట్ ఆర్డర్.. నా జీఓ గాడ్స్ ఆర్డర్” అంటూ బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే తనకి భయం లేదంటూ చెప్పే డైలాగ్ తో పాటు చివర్లో చెప్పే ఇంకో డైలాగ్ కూడా మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఆసక్తి నెలకొల్పాయి. అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉండనున్నాయో హింట్ ఇచ్చేలా చూపించిన యాక్షన్ సీన్స్ వాటికి తమన్ ఇచ్చిన స్కోర్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఈ టీజర్ తో ట్రీట్ ఇచ్చారు మేకర్స్.. ఓవరాల్ బాలయ్య మాస్ తో #NBK107 ఫస్ట్ హంట్ ఆకట్టుకొని అదుర్స్ అనిపించింది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు టీజర్ తో ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

 మైత్రి మూవీ బేనర్ పై నవీన్ వై, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.  దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics