బాల‌కృష్ణ‌ కొత్త సినిమా ప్రారంభం

Thursday,June 13,2019 - 05:31 by Z_CLU

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ హిట్ కాంబినేష‌న్‌లో `జైసింహా` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత రూపొందుతున్న చిత్ర‌మిది.

ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు షాట్ కు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి, జైసింహా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు చిరంతన్ భట్.

స‌మ‌ర్ప‌ణ: సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
బ్యాన‌ర్‌: హ్యాపీ మూవీస్‌
ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.రవికుమార్‌
క‌థ‌: ప‌రుచూరి ముర‌ళి
సంగీతం: చిరంత‌న్ భ‌ట్
సినిమాటోగ్ర‌ఫీ: సి.రామ్‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: చిన్నా
డైలాగ్స్‌: ర‌త్నం
ఫైట్స్‌: రామ్‌లక్ష్మ‌ణ్‌
నిర్మాత‌: సి.క‌ల్యాణ్‌
కో ప్రొడ్యూస‌ర్‌: సి.వి.రావ్‌