Balakrishna - కొత్త సినిమా స్టార్ట్ చేసిన నటసింహం

Saturday,November 13,2021 - 05:46 by Z_CLU

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Launched Grandly

నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాస్ హీరో మరియు మాస్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే మాస్‌ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్దం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు గోపీచంద్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

balakrishna Gopichand malineni movie launch

పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ నటిస్తోంది. #NBK107 అంటూ వర్కింగ్ టైటిల్‌‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రారంభోత్సవం నేడు హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను మేకర్లకు అందజేశారు.

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

సాంకేతిక పరంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.

balakrishna Gopichand malineni movie launch

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలకృష్ణకు తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేయనున్నారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ : గోపీచంద్ మలినేని
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : తమన్ ఎస్
డీఓపీ : రిషి పంజాబీ
ఎడిటర్ : నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్ : ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్ రామ్ లక్ష్మణ్
సీఈవో : చెర్రీ
కో డైరెక్టర్ : కుర్రా రంగరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్ : బాల సుబ్రహ్మణ్యం కేవీవీ
పబ్లిసిటీ : బాబా సాయి కుమార్
మార్కెటింగ్ : ఫస్ట్ షో
పీఆర్వో : వంశీ-శేఖర్