నమిత వెడ్డింగ్ డీటెయిల్స్

Thursday,November 16,2017 - 11:13 by Z_CLU

స్నేహితుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈమధ్యే ప్రకటించింది నమిత. కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసి, అక్కడే ఎక్కువ సర్కిల్ ఉండడంతో చెన్నైలో ఈమె పెళ్లి గ్రాండ్ గా జరుగుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ నమిత మాత్రం తిరుపతిని సెలక్ట్ చేసుకుంది. అవును.. సంగీత్, పెళ్లి అన్నీ ఇక్కడే. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రముఖులకు కామన్ గా ఉంటుందని ఈ ప్లేస్ సెలక్ట్ చేసుకుంది నమిత.

తిరుపతిలోని సింధూరి పార్క్ హోటల్ లో ఈనెల 22న జరగనున్న సంగీత్ తో నమిత-వీరేంద్ర పెళ్లి తంతు ప్రారంభం అవుతుంది. ఆరోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాల నుంచి సంగీత్ ప్రారంభమౌతుంది. సంగీత్ తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి 24వ తేదీన తిరుపతిలోని ఇస్కాన్ లో పెళ్లి చేసుకుంటారు నమిత, వీరేంద్ర.

పెళ్లికి సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించింది నమిత. సినీప్రముఖులతో పాటు తమిళనాడుకు చెందిన కొందరు రాజకీయనాయకులు కూడా ఈ పెళ్లికి హాజరవుతారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని నమిత ఇప్పటికే ప్రకటించింది.