రిలీజ్ కి రెడీ

Tuesday,April 25,2017 - 03:30 by Z_CLU

సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, తనీష్, రెజీనా, ప్రగ్య జైస్వాల్ లతో కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. ఒక సాంగ్ మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో ఓ పాపులర్ స్టార్ హీరోయిన్ తో ఆ సాంగ్ చిత్రీకరించబోతున్నాడట కృష్ణవంశీ..


చిన్నతనం నుంచి ‘పోలీస్’ అవ్వాలని ప్రయత్నించే ఓ యువకుడి కథ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ 45 నిడివి గల పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది, ఓ పాపులర్ స్టార్ హీరోయిన్ పై త్వరలోనే ఆ సాంగ్ ను చిత్రీకరించనున్నాం.. ఆ సాంగ్ సినిమాకు స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందని తెలిపారు మేకర్స్.. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.